అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయని మంత్రి విడదల రజనీ వెల్లడించారు.. సోమవారం కుటుంబ సమేతంగా సచివాలయానికి వచ్చిన ఆమె తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. మెడికల్ సర్వీసెస్ విషయంలో ఏపీ ఐకాన్‌గా నిలుస్తోందని.. ఏపీలో అందుతున్న వైద్య సేవల పట్ల కేంద్రం నుంచి ప్రశంసలు అందుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయని తెలిపారు.
వచ్చే నెలాఖరులోపు అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు. వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు పాలసీ ద్వారా ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సమకూరుస్తున్నామన్నారు. టెలీ మెడిసిన్ సర్వీసెస్.. హెల్త్ సెంటర్లను కూడా ఏర్పాటు- చేస్తున్నామని, పేదలకు వైద్యం అందించే విషయంలో సీఎం వైఎస్ జగన్ ఎక్కడా రాజీ పడడం లేదని గుర్తుచేశారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు వైద్య సేవలందిస్తున్నాం.. ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా రూపొందిస్తున్నామని మంత్రి విడదల రజనీ తెలిపారు ముఖ్యమంత్రి జగన్.. వైద్య రంగాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారన్నారు.