Sunday, September 22, 2024

AP: కాకినాడ ఘటనపై వైద్య సంఘాల ఫైర్..

కర్నూలు బ్యూరో : ఆట స్థలం విషయంలో కాకినాడ డాక్టర్ ఉమామహేశ్వర్ రావు లేవనెత్తిన అభ్యంతరాలకు జనసేన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడికి పాల్పడిన ఘటనపై కర్నూలు జిల్లా వైద్య సంఘాలు మండిపడుతున్నాయి. కళాశాల అధికారుల అనుమతి తీసుకోకుండా మైదానంలో సొంత వాలీబాల్‌ కోర్టు ఏర్పాటు చేయడంతో ఉమా మహేశ్వర రావు అభ్యంతరం తెలిపారు. ఆ తర్వాత దీనిపై ఎమ్మెల్యే, అతని అనుచరులు, డాక్టర్లు, విద్యార్థులపై దాడి చేయటం, తీవ్ర పదజాలంతో దుర్భాషలాడడం చాలా అమానుషమని ఏపీ ఎఫ్ఎం టి, ఏపీ జీడీఏ, ఏపీ జూడా సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధి ఈ హేయమైన చర్యకు పాల్పడటం సరి కాదన్నారు. ఈ దాడికి నిరసనగా వైద్య సంఘాల ఆధ్వర్యంలో నిర‌స‌న వ్యక్తం చేయనున్నట్లు వెల్లడించారు. త‌మ‌ ప్రధాన కార్యదర్శి డా.సుబ్బారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా వారితో మాట్లాడి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే క్రూరమైన వైఖరిని ఖండిస్తున్నట్లు చెప్పారు. తదుపరి కార్యాచరణ రూపొందించాలని ఏపీ జూడా నాయకుడు డాక్టర్ జయసుధీర్ కోరారు.

పవన్ కళ్యాణ్ వారి పార్టీ ప్రతినిధిగా అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్ఎంసి ప్రిన్సిపాల్ నమోదు చేసిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర ఆందళనకు రాష్ట్రవ్యాప్తంగా సంసిద్ధం అవుతామని ఏబీఏ ఎఫ్ఎంటి ప్రొఫెసర్, హెచ్ ఓడీ, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సాయి సుధీర్ పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement