Tuesday, November 26, 2024

AP | తిరుమల ఘాట్‌ రోడ్లలో ప్రమాదాల నివారణకు చర్యలు.. అధికారులకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదేశం

తిరుమల, పభన్యూస్‌ : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్‌రోడ్లలో ప్రమాదాల నివారణకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి కఅధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో జెఇఓ వీరబ్రహ్మంతో కలసి విజిలెన్స్‌, పోలీస్‌, ,వైద్య, ఆర్టీసి, ఫారెస్ట్‌,, స్విమ్స్‌, బర్డ్‌,శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఈవో మాట్లాడుతూ, రెండు ఘాట్‌రోడ్లలో ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సివిఎస్వో నరసింహకిషోర్‌ను ఆదేశించారు.

ఘాట్‌ రోడ్లలో ప్రమాదాలు జరిగినపుడు విజిలెన్స్‌ సిబ్బంది స్విమ్స్‌, బర్డ్‌,శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రి అధికారు.లను అప్రమత్తం చేయాలన్నారు. .స్విమ్స్‌ వద్ద పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ ఏర్పాటు చేయాలన్నారు.. ఘాట్‌రోడ్డులో ప్రమాదకరమైన అవ్వాచారి కోన, ,కపిలతీర్థం పైభాగంలో మాల్వాడి గుండం వద్ద రోలర్‌ పోస్టర్‌ బ్యారియర్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. .తరచు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, వంద శాతం నిఘా పెంచి,భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. అలిపిరి సమీపంలో పార్కింగ్‌ ప్రదేశాన్ని గుర్తించి ప్రీపెయిడ్‌ టాక్సీ సేవలను అందించేందుకు సాద్యాసాద్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా తిరుమలలోని వివిధ ప్రాంతాలకు భక్తులను చేరవేసే ధర్మరథాలను రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఎక్కువ సంఖ్యలో తిప్పాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సులలో తిరుమలలో భక్తులు చేయవలసిన, ,చేయకూడనివి రికార్డు చేసి ఆడియో సిస్టమ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం అలిపిరి,జియన్‌సి టోల్‌గేట్లు తెరిచే సమయంలో ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణలో బస్సులు అధిక వేగంగా పోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నుండి శ్రీవారి ఆలయం,రెండు ఘాట్‌రోడ్లు, ,రెండు నడక మార్గాలో నిఘాను మరింత పెంచాలన్నారు. ఈ సమావేశంలో సీఈ నాగేశ్వరరావు, రవాణా విభాగం జియం శేషారెడ్డి, డిఎఫ్‌ఓ శ్రీనివాసులు ,ఎస్టేట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ మల్లికార్జున, శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి, బర్డ్‌ డాక్టర్‌ కిషోర్‌,స్విమ్స్‌ డాక్టర్‌ రామ్‌, జిల్లా ప్రజారవాణ అధికారి జితేంద్రనాథ్‌రెడ్డి, తిరుమల ఎఎస్పి మునిరామయ్య, డిఎస్పి కొండయ్య, విజివో మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement