ప్లాస్టిక్ హటావో – కర్నూలు బచావో కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలో ప్లాస్టిక్ లేకుండా సమూలంగా ప్రక్షాళన చేసేంత వరకు నగర పాలక సంస్థ పోరాటం ఆగదని నగర మేయర్ బి.వై రామయ్య తెలిపారు. ఆదివారం మద్దూర్ నగర్, సి.క్యాంపు రైతు బజార్లో మాంస విక్రయ దుకాణాలు, కూరగాయల, టి, పండ్ల, తోపుడు బండ్లు, ఇతర వస్తువుల విక్రయం చేస్తున్న దుకాణాల వద్దకు మేయర్ రామయ్యతో పాటు అధికారులు, కార్పొరేటర్లు వెళ్లి అవగాహన కల్పిస్తూ ‘బాధ్యతయుతమైన కర్నూలు పౌరుడు’ అనే సర్టిఫికెట్ లను అందజేశారు. ప్లాస్టిక్ హటావోలో అందరూ ఒక్కటే అనే సంకేతాన్ని ప్రజల్లోకి, అధికారుల్లోకి వెళ్ళేందుకు, మటన్ కొరకు స్టిల్ బాక్స్ తెచ్చిన అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్ మేయర్ అభినందించి ‘బాధ్యతాయుతమైన కర్నూలు పౌరుడు’ అనే సర్టిఫికెట్ అందజేశారు.
ఈ సందర్భంగా మేయర్ బి.వై రామయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ హటావో – కర్నూలు బచావో కార్యక్రమాన్ని 100% విజయవంతం చేస్తామన్నారు. ముందుగా ప్రజలకు అవగాహన కల్పించి, విక్రయాలపై చర్యలు తీసుకుంటామన్నారు.ఆ తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్, ప్లాస్టిక్ తో ప్యాక్ చేసే ఇతర వస్తువులపై దశల వారీగా చర్యలు తీసుకుంటామన్నారు.ప్రజలు, వ్యాపారస్థులు కూడా ప్లాస్టిక్ ను తిరస్కరించి, పర్యావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ భాస్కర్ రెడ్డి, వైకాపా నాయకులు కటారి సురేష్, భాస్కర్, కార్పొరేటర్ రవణమ్మ, సానిటేషన్ ఇన్స్పెక్టర్, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద