ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భారత తొలి విద్యా శాఖ మాత్యులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని గుంటూరు అర్బన్ ఎస్పి ఆరిఫ్ ఆఫీజ్ అన్నారు. గురువారం ఆయన 133వ జయంతి సందర్భంగా అర్బన్ పోలీస్ ఆఫీస్ నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. భారత తొలి విద్యా శాఖ మాత్యులు గా ఎన్నిక కాబడి దేశానికి ఎన్నో సేవలు చేసిన ఆ మహనీయుడునీ జన్మదినం జరుపుకొనటం ఎంతో ఆనందదాయకం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుంటూరు అర్బన్ అడిషనల్ ఎస్పీ గంగాధరంగారు ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పి రవికుమార్ డి పి ఓ ఏవో వరలక్ష్మి , అర్బన్ RIఅడ్మిన్ తామస్ రెడ్డి , వెల్ఫేర్ ఆర్ ఐ రాజారావు , ఎమ్. టి ఆర్ ఐ రాఘవరావు ఎస్సైలు ఆర్ ఎస్ ఐ లు పోలీస్ సిబ్బంది హాజరు అయ్యారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement