Saturday, September 14, 2024

AP: తిరుపతి జిల్లాలో భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ.. ఎస్పీ సుబ్బరాయుడు

తిరుపతి జిల్లాలో భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తెలిపారు. సదరు సెల్ ఫోన్లను గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బాధితులకు అందజేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. సీఈఐఆర్ పోర్టల్ మొబైల్ హంట్ ల ద్వారా సుమారు 90 లక్షల రూపాయల విలువ గల 500 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు తెలిపారు.

తిరుపతి జిల్లాలో సెల్ ఫోను పోగొట్టుకున్న వారి కోసం ప్రత్యేకంగా తిరుపతి జిల్లా పోలీసు వారు ఏర్పాటు చేసిన మొబైల్ హంట్ (WhatsApp 9490617873) అప్లికేషన్ సేవల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై గతంలో సుమారు రూ.5,45,40,000ల విలువ గల 9 విడతల్లో 3,030 సెల్ ఫోన్లను రికవరీ చేసి సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు అందజేయడం జరిగిందన్నారు. ప్రసుత్తం 10వ విడతలో సుమారు రూ.90,00,000ల విలువ గల 500 మొబైల్ ఫోన్లను సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారన్నారు. మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై ప్రత్యేక నిఘా వేసి, తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసులు మొబైల్ హంట్ సేవల ద్వారా బాధితులకు న్యాయం చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement