తిరుపతిలో జనవరి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరిగే జాతీయ స్తాయి కబడ్డీ పోటీలను జయప్రదం చేయాలని మంగళవారం ఉదయం జీవకొనలోని విశ్వం స్కూల్ విద్యార్తులు అధినేత డా.ఎన్.విశ్వనాథ్ రెడ్డి ఆద్వర్యంలో జీవకొన వీదులల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిగా పాల్గొన్న ఆప్స్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాజా రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ క్రీడ ఐన కబడ్డీ నేటి విద్యార్తులకు తెలియదని కేవలం క్రికెట్ మోజులో పడి కబడ్డీని మరచిపోతున్నారని అన్నారు. జాతీయ స్తాయి కబడ్డీ పోటీలు తిరుపతి శాసన సభ్యులు భూమాన కరుణాకర్ రెడ్డి చొరవతో తిరుపతిలో మునిసిపల్ కార్పొరేషన్ అడ్వర్యంలో నిర్వహించడం గర్వకారణమని అన్నారు.
విశ్వం స్కూల్ అధినేత డా.యన్.విశ్వనాథా రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్తాయి కబడ్డీ పోటీలులను జయప్రదం చేయాలని బుధవారం జరిగే విద్యార్తుల మహా ప్రదర్శనను పెద్ద ఎత్తున విద్యార్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ద్వారక నాద రెడ్డి, స్కూల్ హెడ్ మాస్టర్ పిసీ.సుబ్రమణ్యం, పి.హరి నాయక్, వెంకటరత్నంతో పాటు పెద్ద ఎత్తున విద్యార్తులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital