ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆగస్టు 3తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. సెకండరీ గ్రేడ్ టీచర్ కేటగిరీలో పేపర్ 1-ఏ కోసం 1,82,609 మంది దరఖాస్తు చేసుకోగా…, పేపర్ 1-బి కి 2,662 మంది దరఖాస్తు చేసుకున్నారు.
స్కూల్ అసిస్టెంట్ టీచర్ కేటగిరీలో పేపర్ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది, మ్యాథ్స్ & సైన్స్‌కు 1,04,788 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. సోషల్ స్టడీస్ కోసం 70,767 మంది అభ్యర్థులు, స్కూల్ అసిస్టెంట్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పేపర్ 2-బి కేటగిరీకి 2,438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇక గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే (అక్టోబర్ 3 నుంచి 20 వరకు) టెట్ పరీక్షలు నిర్వహిస్తామని…. అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు వెల్లడించారు.