Friday, November 22, 2024

ఏపీలో మాస్క్ ధరించకుంటే కఠిన చర్యలు..

ఏపీలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి..అయితే కేసుల ఉధృతి మరల పెరగకుండా కఠిన ఆంక్షలను కొనసాగిస్తోంది ప్రభుత్వం. మాస్కులు ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతోంది… ప్రతి ఒక్కరు బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది..మాస్క్‌ ధరించకపోతే రూ.100ల జరిమానా కచ్చితంగా అమలు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారులకు వరకూ మాస్క్‌లు ధరించాల్సిందే. ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలతో పాటు అవసరమైతే 2–3 రోజులు దుకాణాలు మూసివేతకు ప్రభుత్వం ఆదేశించింది. ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఎవరైనా ఫొటో తీసి పంపినా జరిమానాలు విధించే విధంగా దీని కోసం ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ కఠినంగా అమలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలెవ్వరూ గుమిగూడకుండా కఠిన ఆంక్షలతో పాటు మార్కెట్లు, తదితర చోట్ల కూడా మాస్క్‌లు ధరించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కెట్‌ కమిటీలు మాస్క్‌లు ధరించేలా చూడాలంటూ ప్రభుత్వం ఆదేశించింది.

ఇది కూడా చదవండి: జులై 19 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement