ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ ల వివాహం నిరాడంబరంగా జరిగింది. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీస్ అధికారి దేవేంద్ర కుమార్ ను మచిలీపట్నం కలెక్టరేట్ ఆమె ఛాంబర్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
రాజస్థాన్ కు చెందిన దేవేంద్ర కుమార్ ఐపిఎస్ అధికారి. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న దేవేంద్ర కుమార్ తో ఈరోజు జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో అపరాజ్ సింగ్ వినోద్ దేవేంద్ర కుమార్ ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.