Friday, November 22, 2024

లొంగు’బాట’లో మావోయిస్టులు.. హింసను వీడాల‌ని డీజీపీ పిలుపు

అమరావతి, ఆంధ్రప్రభ : కొద్దిరోజుల క్రితం చెలరేగిపోయిన మావోయిస్టులు ఇప్పుడు లొంగుబాట పట్టారు. ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో నిత్యం ఉనికి కోసం పాట్లుపడుతూ గిరిజన ప్రజలను ప్రభావితం చేసేందుకు విఫలయత్నం చేస్తున ్న దళ సభ్యులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపుతున్నారు. కార్యకలాపాలకు స్వస్తి చెప్పి జనంలో కలిసిపోయిన కొర్రా లక్ష్మణరావును గతనెల 4వ తేదీన ఇన్‌ఫార్మర్‌ నెపంతో మావో కాల్చి చంపడంతో గిరిజన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కొనసాగుతూ ఉంది. అంతకుముందు ఏడాది క్రితం లక్ష్మణరావు సోదరుడు సత్తిబాబును కూడా మావోలే పొట్టన పెట్టుకున్నారు. దీంతో ఏజెన్సీలో మావోలను రానివ్వమంటూ గిరిజన ప్రజలు భారీ ఎత్తున గతనెల ఏప్రిల్‌ 6న ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఈక్రమంలో కొద్దిరోజుల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద మావోలు ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును తగులబెట్టారు కూడా. ఈఘటనతో క్రమేణా కోల్పోతున్న తమ ప్రాబల్యాన్ని నిలబెట్టుకునేందుకు ఓవైపు ప్రయత్నాలు సాగిస్తుండగా, మరోవైపు దళంలోని అనేక మంది సభ్యులు ప్రజాజీవనంలోకి రావాలని ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దండకారణ్యంలో నిరంతరం పోలీసుల కూంబింగ్‌, అనారోగ్య సమస్యలు, కుటుంబ బలహీనత వంటి అంశాలు ప్రభావం చూపడంతో కమిటీ సభ్యులు, ముఖ్యంగా మిలీషియా సభ్యులు పార్టీని వీడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులకున్న సమాచారం.

అయితే కొందరిని పార్టీ నాయకత్వం వారిస్తుంటే ఖాతరు చేయని మరికొందరు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలోనే ఐదుగురు మావోపార్టీ సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన ఈ ఐదుగురు ముఖ్యమైన స భ్యులు కావడం గమనార్హం. వీరిపై ప్రభుత్వం తలకు లక్ష రూపాయలు రివార్డు కూడా గతంలో ప్రకటించింది. అనేక కేసుల్లో ప్రమేయం ఉన్న ఈ ఐదుగురు దళ ముఖ్య సభ్యులని, లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయినందున ప్రభుత్వం తరుఫున రావాల్సిన అన్ని సౌకర్యాలు అందుతాయని, అదేవిధంగా ఒక్కక్కరి తరపై ఉన్న లక్ష రూపాయల నగదు వారికే ఇవ్వడం జరుగుతుందని డీజీపీ కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డి తెలిపారు. ఇంకా ఉన్న మావోలు హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని వారికి పోలీసు శాఖ ప్రభుత్వం తరుఫున అన్ని విధాల సహకరిస్తుందని పిలుపునిచ్చారు. ఐదుగురు మావోలు లొంగిపోగా.. ముఖ్యమైన మరో ఇద్దరని అరెస్టు చేశామని కసిరెడ్డి వెల్లడించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు తెలియచేశారు.

లొంగిపోయిన వారు వీరే..
కాగా, పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు పార్టీ సభ్యులుగా కాగా, మరో ఇద్దరు మిలీషియా కమాండర్లు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జికె వీధి మండలం పెదపాడు గ్రామానికి చెందిన కిల్లో రాజు అలియాస్‌ పెదపాడు రాజు (25), బూదరాల్ల పంచాయితీ నల్లబి ల్లి గ్రామానికి చెందిన సిందేరి మోహన్‌ అలియాస్‌ మహేష్‌, అలియాస్‌ జాంబ్రి (33), వంతల భాస్కరరావు అలియాస్‌ సుశాంత్‌ అలియాస్‌ జట్టు (20), జికె మండలం పామురాయి గ్రామానికి చెందిన మిలీషియా కమాండర్‌ గెమ్మిలి కేసు అలియాస్‌ పామురాయి కేసు (38), మరో మిలీషియా కమాండర్‌ వంతల కృష్ణ (30) అలియాస్‌ పామురాయి కృష్ణ అనే ముగ్గురు లొంగిపోయారు. ఈ ఐదుగురు గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement