Sunday, November 17, 2024

ఎన్ఐఏ అదుపులో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, దివంగత ఆర్కే సతీమణి శిరీష

ఒంగోలు – మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, దివంగత ఆర్కే సతీమణి శిరీషను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని స్వగృహం నుంచి శిరీషను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ఆమెను అక్కడి నుంచి తరలించారు.


ఇటీవల శిరీష ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలపై శిరీష స్పందిస్తూ భర్త, కుమారున్ని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వుండగా ఇలా విచారణ, సోదాల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం విజయవాడకు వెళ్లానని. తాను ఇంట్లో లేని సమయంల ఎన్ఐఏ సోదాలు చేపట్టిందని అన్నారు. మావోయిస్టులకు నగదు పంపించినట్లు ఎన్ఐఏ అధికారులకు చేపుతున్నదాంట్లో నిజం లేదని శిరీష అప్పట్లో పేర్కొన్నారు. తాజాగా ఆమెను ఎన్ఐ ఎ అధికారులు అదుపులోకి తీసుకుని త‌మ కార్యాల‌యానికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement