Saturday, November 23, 2024

టీచ‌ర్ల బ‌దిలీల‌కు అడ్డంకులు…

అమరావతి, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయ బదిలీలు చేపట్టేందుకు 2022లో విడుదల చేసిన జీవో నెంబర్‌ 187, 190లను ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.39 విడుదల చేసింది. ఈ జీవోలపై హైకోర్టు లో కేసులు ఉండడంతోనే వాటిని ఉపసంహరించుకు న్నట్లు ప్రభుత్వం తెలిపింది. అందరికీ ఆయోద యాగ్యం కాని రీతిలో బదిలీల జీవోలు విడుదల చేయడంతో చాలా మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యా య సంఘాలు హైకోర్టులో రిట్‌ పిటిషన్లు వేశాయి. ఈ నేపథ్యంలో 2022లోనే జరగాల్సిన బదిలీలు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆగిపోయాయి. అయితే గత ఏడాదిలోనే జరగాల్సిన బదిలీలు ఇక ఎప్పుడు జరుగుతాయో తెలియకుండా పరిస్థితి ఉంది. ఇటీవల విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారా యణ మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవుల్లో చేయగల్గితే చేస్తామని, లేకుంటే ఆ తర్వాతే బదిలీలు ఉంటాయని చెప్పారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు తెలుపుతున్నాయి. అన్ని సంఘాలతో మాట్లాడి వీలైనంత ఎక్కువ మందికి ఆమోదమయ్యేలా విధానాలు రూపొందిం చి వేసవి సెలవుల్లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంక టేశ్వర్లు డిమాండ్‌ చేశారు. వేసవి సెలవుల తర్వాత బదిలీలు అంటే టీచర్ల ధ్యాసంతా బదిలీలు, ప్రమోషన్ల మీదనే ఉంటుందని, పిల్లలకు మంచి చదువు చెప్పే అవకాశం పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్ల బదిలీలకు సంబంధించి పకడ్బంధీ మార్గదర ్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పదే పదే కోర్టుల నుండి సమస్యలు రాకుండా పూర్తి స్థాయిలో ఒక ట్రాన్స్‌ఫర్స్‌ కోడ్‌ను రూపొందించే పనిలో ఉన్నామని ఇటీవల విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న పద్దతులను కూడా అధ్యయనం చేస్తామని చెప్పారు. అయితే గతంలోనే సంధ్యారాణి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా ఉన్న సమయంలో ట్రాన్స్‌ఫర్స్‌ కోడ్‌కు సంబంధించి ఒక ముసాయిదాను రూపొందించారు. వాటిని ఉపాధ్యాయ సంఘాలకు కూడా అందించారు. కానీ ఆ తర్వాత వచ్చిన కమిషనర్‌ చినవీరభద్రుడు ఆ ముసాయిదాను బుట్టదాఖలు చేశారు. ప్రభుత్వం మళ్లిd ట్రాన్స్‌ఫర్స్‌ కోడ్‌ అంటోంది. దీని కోసం చట్టం చేయాల్సి ఉంది. అంతకు ముందు వివిధ రాష్ట్రాల్లో అమలవతున్న విధానాన్ని సమగ్రంగా పరిశీలించాలి. అయితే ఇవన్నీ జరిగేదేప్పుడు… చట్టం వచ్చేది ఎప్పుడు…బదిలీలు జరిగేది ఎప్పుడని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కనీసం జూన్‌ ఆఖరు నాటికైనా ట్రాన్స్‌ఫర్స్‌ కోడ్‌ను రూపొందించి బదిలీలు నిర్వహించాలని ఎపిటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్వి హృదయరాజు డిమాండ్‌ చేశారు.

అడ్డంకిగా క్రమబద్దీకరణ జీవో
ఒక వేళ ఉపాధ్యాయ సంఘాలను ఒప్పించి బదిలీలు చేపట్టాలన్నా పాఠశాలల క్రమబద్దీకరణ కోసం వి డుదల చేసిన జీవోలు అడ్డంకిగా ఉన్నాయి. క్రమబద్దీకరణ జీవో 117కు వ్యతిరేకంగా హైకోర్టులో ఉపాధ్యాయ సంఘాలు, సామాజిక కార్యకర్తలు కేసులు వేశారు. తెలుగు మీడియం నుండి పూర్తిగా తప్పించి ఇంగ్లీష్‌ మీడియంలోనే బోధించడం, ఒక సెక్షన్‌కు టీచర్‌, స్టూడెంట్‌ రేషియాెె 1:40 ఉండాల్సిది 1:53 గా మార్చడం, ఎలిమెంటరీ స్తాయిలో 1:20గా ఉండాల్సింది 1:30గా మార్చడం, 3,4,5 తరగతులను మూడు కిలోమీటర్లలోపు ఉన్న పాఠశాలల్లో తీసుకెళ్లి కలపడం లాంటి క్రమబద్దీకరణ చర్యలకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు తేలకుండా సాధారణ స్థితిలో బదిలీలు జరిపే అవకాశం లేదు. అయితే ట్రాన్స్‌ఫర్స్‌ కోడ్‌ను రూపొందిస్తే అది చట్టంగా ఉంటుంది కాబట్టి బదిలీలు చేపట్టే అవకాశముంది. అయితే బదిలీలు చట్టం చేసేందుకు చాలా సమయం పట్టే అవకాశముంది. దీంతో ఇప్పుడిప్పట్లో టీచర్ల బదిలీలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement