Tuesday, November 26, 2024

AP | దేశంలో తొలి ఎంపాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్ తయారీ..

విశాఖ మెడ్​టెక్ జోన్ మరో ఘనత నమోదు చేసింది. కరోనా సమయంలో ఆరోగ్య రంగానికి అవసరమైన అనేక దేశీయ ఉత్పత్తులను అందించిన విశాఖ మెడ్‌టెక్ జోన్‌… తాజాగా మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా తయారైన తొలి Monkeypox RT-PCR కిట్​ను ఉత్పత్తి చేసింది.

మెడ్​టెక్ జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్బామ్ డీఎక్స్ మంకీ పాక్స్ కెకె ఆర్టీ-పాక్స్ పేరిట కిట్ రూపకల్పన చేసింది. ఈ కిట్​కి ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ అర్గనైజేషన్ నుంచి అత్యవసర అంగీకారం లభించింది. మెడ్‌టెక్ జోన్ సిఇఒ డాక్టర్ జితేంద్ర శర్మ మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య ఆవిష్కరణలలో భారతదేశం అగ్రగామిగా ఉందని ఈ ఆవిష్కరణ ప్రతిబింబిస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement