Sunday, December 8, 2024

AP | రాజ‌ధానికి మంత్రాలయ పీఠాధిపతి రూ.50లక్షల విరాళం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు రూ.50 లక్షల విరాళం అందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసిన పీఠాధిపతి, మఠం సభ్యులు ఆయనను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా మంత్రాలయం తరపున రాజధాని నిర్మాణానికి తమ వంతుగా రూ. 50 లక్షలు విరాళంగా అందజేశారు. అనంతరం మంత్రి లోకేశ్‌ను కలిసి ఆశీర్వదించారు. అమరావతి నిర్మాణానికి విరాళం అందించిన సుబుదేంద్ర తీర్థులు, మఠం సభ్యులకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement