మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. మన్సాస్ ట్రస్ట్ పై ఆధిపత్యం కోసం ఇప్పటికే అశోక్ గజపతిరాజు, ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయిత ప్రయత్నించిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ మాన్సాస్ ట్రస్టు అంశంలో హైకోర్టును ఆశ్రయించారు. ఇన్నాళ్లు ట్రస్ట్ విషయంలో సైలెంట్ గా ఉన్న ఊర్మిళ ఇప్పుుడు కోర్టు ను ఆశ్రయించడంతో కీలక పరిణామం చేటుచేసుకుంది. మాన్సాస్ ట్రస్టు చైర్మన్ విషయంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఆమె అప్పీల్ చేశారు. అశోక్ గజపతిరాజును చైర్మన్ గా కొనసాగిస్తూ ఇటీవల సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిందే.
మాన్సాస్ ట్రస్టు చైర్మన్ గా తనను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె తన న్యాయవాది ద్వారా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఊర్మిళ మాన్సాస్ ట్రస్టుకు వారసురాలేనని ఆమె తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా హైకోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: మీ పేరులో నీరజ్ ఉంటే పెట్రోల్ ఉచితం