విజయనగరం లోని మాన్సాస్ ట్రస్టు ఎట్టకేలకు ఆడిట్ నిర్వహించేందకు అధికారులు సిద్దమయ్యారు. సోమవారం నుంచి ఆడిట్ నిర్వహించేందుకు జిల్లా ఆడిట్‌శాఖ అధికారులు వస్తున్నట్లు అధికారవర్గాలు ధ్రువీకరించాయి. ఈ మేరకు రికార్డులు సిద్ధమయ్యాయి. 16 సంవత్సరాల తర్వాత జరగనున్న ఈ ఆడిట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక తాము ఆడిట్‌కు సిద్ధంగా ఉన్నామని తెలిపారు మాన్సాస్ ట్రస్టు కార్యనిర్వహణాధికారి డి.వెంకటేశ్వరరావు. రికార్డులన్న తాము అందుబాటులో ఉంచామని తెలిపారు. ముందుగా హార్డ్ కాపీలను అందజేశాం. సోమవారం నుంచి ఆడిట్ నిర్వహిస్తామని సమాచారమిచ్చారు. ఆడిట్ జరిగితే లోపాలుంటే బయటపడతాయి. సరిదిద్దుకునే అవకాశం కలుగుతుందని లెక్కలు తేల్చాల్సినవి ఉన్నట్లు ట్రస్టు కార్యనిర్వహణాధికారి డి.వెంకటేశ్వరరావు తెలిపారు.
దేవాలయాలు – 105
భూములు- 14,421.99 (ఎకరాలు)
విద్యాసంస్థలు- 13
ఇది కూడా చదవండి: బ్రిటన్ అన్ లాక్.. మాస్కులు ధరించడం ఇక ప్రజల ఇష్టం!