Saturday, November 23, 2024

నవ్యాంధ్రకు మణిహారం నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌.. రోగులకు ఉచితంగా అపరేషన్లు..

గుంటూరు మెడికల్‌ , ఫ్రభన్యూస్‌: క్యాన్సర్‌ … ఈ పేరు చేబితే సామాన్య ప్రజల నుంచి అందరూ హడలిపోతారు. చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో … మనవల్లకాదు అనుకుంటూ నిరుత్సాహంతో ప్రాణాలపై అశలు వదులుకుంటున్నారు. .అలాంటి వారి కష్టాలకు మేమున్నాం అంటూ భరోసానిస్తోంది గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నన్నపనేని లోకాదిత్యుడు సీతారావమ్మ స్మారక నాట్కో ట్రస్ట్‌ క్యాన్సర్‌ సెంటర్‌.

ప్రపంచ స్దాయి వైద్య ప్రమణాలు..
రూ. 65కోట్లతో నిర్మించిన‌ ఈ అధునాతన క్యాన్సర్‌ సెంటర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాన్సర్‌ రోగులకు చికిత్స అందుతోంది. రూ. 17కోట్ల విలువైన వైద్య పరికారాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. క్యాన్సర్‌ కణాలను ఖచ్చితంగా అంచనా వేసే లీ నియర్‌ యాక్సిలేటర్‌ పరికరంతో పాటు బ్రాకీధేరఫీ, సిటిసిమ్యూలేటర్‌, సర్జికల్‌ అంకాలజీ, మెడికల్‌ అంకాలజీ వంటి సేవలు 9మంది అత్యుత్తమ వైద్యులు మూడు విభాగాల ద్వారా వైద్యసేవలు అంది స్తున్నారు. క్యాన్సర్‌ కణాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి అక్కడే చికిత్స అందించే విదంగా ఖచ్చితమైన చికిత్స పద్దతి అందించడం ఈ క్యాన్సర్‌ సెంటర్‌ ప్రత్యేకత. రేడియోషన్‌ వల్ల ఇతర కణ జాలలు అవయవాలు దెబ్బతినకుండా లీనీయర్‌ యాక్సిలేటర్‌ పరికరం ద్వారా సరైన చికిత్స అందుతోంది.

రెండేళ్లల్లో 40వేల మందికి పైగా చికిత్స..
జూలై1 2020న ప్రారంభమైన నాట్కో క్యాన్సర్‌ సెంటర్లో ఈ రెండేళ్ళల్లో ఇప్పటి వరకు సుమారు 40 వేలమందికి పైగా చికిత్స పోందారు. క్యాన్సర్‌ చివరి దశలో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా నూతన వార్డును ఏర్పాటు చేయడంతోపాటు ప్రపంచస్దాయి వైద్య ప్రమాణాలతో రూ. 45లక్షలతో అధునాతన అపరేషన్‌ ధియోటర్‌ ద్వారా రోగులకు సేవలు అందిస్తున్నారు. గత రెండు నెలల క్రితం క్యాన్సర్‌ సెంటర్‌ను పరిశీలనకు వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్‌ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు సైతం నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌ సేవలను అభినందించారు.

వైద్యం, మందులు ఉచితమే..
క్యాన్సర్‌ ఏ స్టేజీలో చికిత్స తీసుకునేవారికైనా ,ఆరోగ్యశ్రీ కార్డులేకపోయిననా రోగులకు ఉచిత వైద్యసేవలు అందించడంతోపాటు రోగి కోలుకునేవరకూ నాట్కో ఫార్మాకంపెనీ ద్వారా ఉచితంగా మందులు అందిస్తున్నారు. దాదాపు 110 పడకలతో ప్రతి పడకకు అక్సిజన్‌ సరఫరా ఉండే విదంగా నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌ను రూపొందించారు.

జీజీహెచ్‌ కు అపన్నహస్తం అందిస్తున్న నాట్కోట్రస్ట్‌..
క్యాన్సర్‌కు అధునాతన సేవలు అందిస్తున్న నాట్కో ట్రస్ట్‌ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు సైతం అదేవిదంగా అపన్నహస్తం అందిస్తోంది. 2015లో చిన్నపిల్లల వైద్యచికిత్సను అందించేందుకు 3క ోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు 2017లో న్యూరాలజీ విభాగానికి 25లక్షలు విలువైన వైద్య పరికరాలు అందించారు. అలాగే జీజీహెచ్‌ అర్దో విభాగంలో అదునాతన అపరేషన్‌ ధియోటర్‌ను 65లక్షలతో నిర్మించి ఇచ్చారు. కరోనా కిలకసమయంలో కోటి రూపాయల విలువైన మందులు, పడకలు అందించారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో రక్తపరీక్షల కేంద్రం నిర్మించారు. జీజీహెచ్‌ అభివృద్దికి నాట్కో ట్రస్ట్‌ చేయూత.. నన్నపనేని సదాశివరావు (వైస్‌చైర్మన్‌ నాట్కోట్రస్ట్ ) గుంటూరు ప్రభుత్వవైద్యశాల అభివృద్దికి నాట్కోట్రస్ట్‌ అన్నివేళల ముందుటుంది. ఆసుపత్రిలోఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు రూ కోట్లు వెచ్చించి నిర్వహించాం.భవిష్యత్‌లోను జీజీహెచ్‌కు అండగా నాట్కోట్రస్ట్‌ఉంటుంది.రాష్ట్రవిభజన తరువాత క్యాన్సర్‌ రోగులకు ప్రత్యేకమైన క్యాన్సర్‌ సెంటర్‌ ఉండాలనే క్యాన్సర్‌ సెంటర్‌ను నిర్మించాం..సమాజానికి తిరిగి ఇస్తున్నాం.. నన్నపనేని వెంకయ్యచౌదరి,( నాట్కో ట్రస్ట్‌ చైర్మన్ ) సమాజానికి ఎంతోకోంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో 1995లో నాట్కో ట్రస్ట్‌ ఏర్పాుట చేశాం.ట్రస్ట్‌ ద్వారా రెండు తెలుగురాష్ట్రాల్లో విద్య, వైద్య రంగాలను అభివృద్ది చేసేందుకు అర్థిక సాయాన్ని అందిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా నాట్కోఫార్మాకంపెనిద్వారా 40పైగా దేశాల్లో నాణ్యమైన ఔషదాలను అందిస్తు అందరిమన్ననలుపోందుతున్నాం.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement