Friday, November 22, 2024

Mangalagiri – జగన్ ధనదాహంతో ఇసుక మాయం – నారా లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగ‌ళ‌వారం మంగళగిరి నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలను లోకేష్‌కు విన్న‌వించారు. అమరావతి నిర్మాణం నిలిచిపోవడంతో తామంతా రోడ్డున పడ్డామని వారు ఆవేదన వెలిబుచ్చారు. అనంత‌రం లోకేష్ మాట్లాడుతూ.. జ‌గ‌న్‌ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా పోయింద‌ని ఆరోపించారు.

దీంతో రాష్ట్రంలోని 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో ట్రాక్టర్ ఇసుక రూ.1,500 ఉంటే, జగన్ రెడ్డి పాలనలో రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ధర పలుకుతోందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఇసుక అందుబాటులో లేకుండా పోవడంతో పనులు లేవని వెల్లడించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇసుక రేటు తగ్గించి అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చాను. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానిన భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement