Saturday, November 23, 2024

మాండూస్ ఎఫెక్ట్‌.. తిరుమలలో భారీ వర్షం, పెరిగిన చలి తీవ్రత

తిరుమల, ప్రభన్యూస్‌ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడం కారణంగా గురువారం రాత్రి నుంచి తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్సుకు చేరుకునేందుకు, దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తిరుమలలో సందర్శనీయ ప్రాంతాలైన పాపవినాశనం, ఆకాశగంగ, శిలాతోరణం, శ్రీవారి పాదాలు తదిర ప్రాంతాలు వర్షం కారణంగా భక్తులు లేక వెలవెలపోతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఆరుబయట నిర్వహిస్తున్న దుకాణదారులు మూసివేశారు.

- Advertisement -

దీనికి తోడు ఈదురుగాలు ఎక్కువగా వీస్తుండడంతో చలితీవ్రత పెరిగి చంటిపిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడుతూ గదులకే పరిమితం అయ్యారు. వర్షం కారణంగా తిరుమల గిరులను, ఘాట్‌రోడ్డులను పొగమంచు కమ్మేయండో ఘాట్‌రోడ్డులో ప్రయాణించే వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని టిటిడి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. ఇదిలా ఉంటే గత మూడురోజులుగా తుపాన్‌ ప్రభావం కారణంగా తిరుమలలో చలితీవ్రత పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement