Saturday, January 18, 2025

Manchu Family – ముఖాముఖిగా తేల్చేసుకుందాం …వ‌చ్చేయ్ – విష్ణుకి మ‌నోజ్ పిలుపు

హైద‌రాబాద్ -గ‌త కొన్నిరోజులుగా మంచు ఫ్యామిలీ గొడ‌వ‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. తండ్రీకొడుకుల మ‌ధ్య వైరం ర‌చ్చ‌కెక్కింది. ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకునే వ‌ర‌కు వెళ్లింది. ఇప్పుడు మాట‌ల యుద్ధం మొద‌లైంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా మంచు విష్ణు, మంచు మ‌నోజ్ వ‌రుస పోస్టుల‌తో హీట్ ఎక్కిస్తున్నారు.

తాజాగా మనోజ్ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మ‌రో ఆస‌క్తిక‌ర పోస్ట్ చేశారు. కూర్చొని మాట్లాడుకుందామ‌ని, తాను సింగిల్‌గానే వ‌స్తాన‌ని అందులో పేర్కొన్నారు. “క‌లిసి కూర్చొని మాట్లాడుకుందాం. నాన్న‌, ఇంట్లోని మ‌హిళ‌లు, ఉద్యోగులు, మిగిలిన వాళ్ల‌ను ప‌క్క‌నపెట్టి మ‌న‌మే సామ‌ర‌స్య‌పూర్వకంగా చ‌ర్చించుకుందాం. ఏమంటావ్‌. నేను ఒంటిరిగానే వ‌స్తాన‌ని మాటిస్తున్నా. నీకు న‌చ్చిన వాళ్ల‌ను నీవు తీసుకురావ‌చ్చు. లేదంటే మ‌న‌మే ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్చ పెట్టుకుందాం. నీ క‌రెంట్‌తీగ” అని మ‌నోజ్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.


అంత‌కుముందు ” సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి.. అడవిలో గర్జించడానికి ఉన్న తేడా.. కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ” అనే డైలాగ్ ని షేర్ చేశారు విష్ణు. అయితే ఈ డైలాగుని ఉద్దేశించి మంచు మనోజ్ తాజాగా ఓ ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ” కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజు లాగా సింహం కావాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. నువ్వు ఈ విషయం ఇదే జన్మలో తెలుసుకుంటావు” అంటూ విష్ణు కి కౌంటర్ ఇచ్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement