తెలంగాణాలో ఓ ప్రత్యేక ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక అబ్బాయి ప్రేమ కోసం సమాజపు సంకెళ్లను తెంచుకున్నాడు. ఆ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమలో పడ్డాడు. తెలంగాణలోని ఖమ్మంకు చెందిన గణేష్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామకు చెందిన లింగమార్పిడి దీపును ప్రేమించాడు.
దాదాపు ఏడాది క్రితం నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. హైదరాబాద్‌లో ఈ జంట తరచూ కలవడం ప్రారంభించారు. ఆపై ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ వివాహాన్ని కొంత మంది వ్యతిరేకిస్తుండడంతో ముందస్తు జాగ్రత్తగా గణేష్, దీపు భద్రత కోరుతూ ఇటీవల పోలీసులను ఆశ్రయించారు.