సూళ్లూరుపేట (ప్రభన్యూస్): ఉద్యోగం ఇప్పిస్తానని యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడి నాలుగు నెలల గర్భవతిని చేసిన సంఘటన శ్రీహరికోట శబరీ కాలనీలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల మేరకు శ్రీహరికోట శబరి కాలనీకి చెందిన ఓ యువతిని అదే ప్రాంతానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి షార్ లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మాయమాటలతో ఆమెను లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికి చెప్ప వద్దంటూ యువతని బెదిరింపులకు గురి చేయడంతో ఆమె ఎవరికి విషయం చెప్పలేదు.
ప్రస్తుతం యువతి నాలుగు నెలల గర్భం దాల్చడంతో గోపాల్ తన సమీప బంధువుల ఇంటికి తీసుకువెళ్ళి అబార్షన్ చేయించెందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో యువతి పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని యువతి తెలియజేసింది. తల్లిదండ్రులు శ్రీహరి కోట పోలీస్ స్టేషన్లో గోపాల్ పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని యువతిని చికిత్సల నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital