విజయవాడలో అమానుషం చోటుచేసుకుంది. కళ్ల ముందే భర్త ఓ మహిళపై అత్యాచారం చేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి… అతని భార్య ఆ దృశ్యాలను ఫోన్లో వీడియో తీసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… విజయవాడకు చెందిన ఓ వివాహిత భర్త కేటరింగ్ పని చేస్తూ ఉంటాడు. ఈ నెల 3వ తేదీన రాత్రి ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రపోతోంది. వీరి ఎదురింట్లో దిలీప్, తులసి అనే భార్యాభర్తలు ఉంటున్నారు. రాత్రి 11 గంటల సమయంలో వివాహిత ఇంట్లోకి వారు అక్రమంగా ప్రవేశించారు. వివాహిత నోరు మూసి, తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆమెపై భర్త రెండు సార్లు అత్యాచారం చేయగా, అతడి భార్య వీడియో, ఫొటోలు తీసింది.తర్వాతి రోజు కూడా ఆమెను బెదిరించి మరోసారి అత్యాచారం చేశాడు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పిల్లలిద్దరినీ చంపేస్తానని, ఫొటోలను అందరికీ చూపించి పరువు తీస్తానని బెదిరించాడు. తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలని నిందితుడు పదేపదే వేధిస్తుండడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. నిందితులైన దిలీప్, తులసిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తలపై ఐపీసీ 376(2), 354బి, 354డి, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.