Friday, November 22, 2024

యూట్యూబ్​లో వీడియోలు చూస్తూ లింగమార్పిడి ఆపరేషన్.. అధిక బ్లీడింగ్​తో వ్యక్తి మృతి..​

ఇద్దరు మెడికల్​ స్టైడెంట్స్​ చేసిన ఈ పని మరో వ్యక్తి నిండు జీవితాన్ని బలిగొంది. కొంతకాలంగా సెక్స్​ రీ అసైన్​మెంట్​ (లింగ మార్పిడి) కోసం ట్రై చేస్తున్న ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా వ్యక్తికి.. తక్కువ అమౌంట్​కే తాము ఆ పనిచేస్తామని ఇద్దరు మెడికోలు నమ్మబలికారు. యూట్యూబ్​లో వీడియోలు చూస్తూ.. ఆపరేషన్​ చేస్తుండగా అధిక రక్తస్రావంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నెల్లూరులో జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఇద్దరు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్స్​ యూట్యూబ్ ట్యుటోరియల్‌ని చూసతూ సెక్స్ రీఅసైన్‌మెంట్ సర్జరీకి ప్రయత్నించారు. అది కాస్త వికటించి ఆ వ్యక్తి చనిపోయాడు. దీనికోసం నెల్లూరులో ఓ ప్రైవేట్ లాడ్జి ఇద్దరు బి ఫార్మా విద్యార్థులు రూమ్​ తీసుకుని ఈ బోచ్ ప్రక్రియ చేపట్టారు. మృతుడు ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీకాంత్ (28)గా గుర్తించారు. అతను హైదరాబాద్‌లో చిన్నచిన్న పనులు చేసేవాడు. శ్రీకాంత్ కొంతకాలం క్రితం భార్యను వదిలి ఒంటరిగా ఉంటున్నాడు. అతను ఇద్దరు బీఫార్మా విద్యార్థులతో పరిచయం ఏర్పడి సెక్స్ రీఅసైన్‌మెంట్ సర్జరీ చేయించుకోవాలనే తన కోరికను వెల్లడించాడు.

శ్రీకాంత్ ఈ ప్రక్రియ కోసం ముంబైకి వెళ్లాలనుకున్నాడు. కానీ, ఇద్దరు అండర్ గ్రాడ్‌లు తక్కువ ధరకు అతనికి ఆపరేషన్ చేస్తామని అతనిని ఒప్పించారు. ముగ్గురూ సర్జరీ కోసం ఓ ప్రైవేట్ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. మస్తాన్, జీవా అనే ఇద్దరు విద్యార్థులు యూట్యూబ్‌లో వీడియోను అనుసరిస్తూ ప్రక్రియను ప్రారంభించారు. దురదృష్టవశాత్తు ఆపరేషన్ సమయంలో అధిక రక్తస్రావం కారణంగా శ్రీకాంత్ మరణించాడు. లాడ్జి సిబ్బంది గదిలో మృతదేహాన్ని గుర్తించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్ మరణానికి ప్రధాన కారణం మత్తుమందులు, రక్తస్రావం ఎక్కువగా వాడటం కారణమని వారు పోలీసులకు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement