అరణీయర్ వాగులో పడి గల్లంతైన వ్యక్తి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం అప్పంబట్టు పంచాయతీ బ్రిడ్జి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పూత్తూరు డిఎస్పీ యశ్వంత్ తెలిపిన వివరాలు మేరకు ఇలా ఉన్నాయి. పిచ్చాటూరు మండలం అప్పంబట్టుకు చెందిన అంగరజ్ కుమారుడు చొక్కలింగం(45) స్నేహితులతో కలిసి అరణియార్ ప్రాజెక్టు కాలువ వద్ధ తిరుగుతుండగా ప్రమాదవశాత్తు పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి భార్య చిత్ర, ఇద్ధరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్నీ పూత్తూరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించిన అనంతరం బంధువులుకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, అప్పంబట్టులో అప్పటి వరకు సరదా గడుపుతూ ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మృత్యువాత పడటంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
పూత్తూరు డీఎస్పీ మాట్లాడుతూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న ప్రజలు పట్టించుకోకుండా వాగులు కాజువేలు వద్ద అజాగ్రత్తగా వ్యహరిస్తు ప్రాణాలు పై తెచ్చుకోవద్దుని డిఎస్పీ యశ్వంత్ చెప్పారు.
ఇది కూడా చదవండి: తిరుపతి పర్యటనకు ఏపీ సీఎం జగన్
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily