Friday, November 22, 2024

పవన్ వారాహి యాత్రను విజయవంతం చేయండి.. జనసేన శ్రేణులకు నాదెండ్ల పిలుపు

పవన్ వారాహి యాత్రను విజయవంతం చేయాలని జనసేన పార్టీ శ్రేణులకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. శుక్రవారం విశాఖపట్నం ముఖ్య నేతలతో భేటీ నిర్వహించి కార్యక్రమాలను సమీక్షించారు. జగదాంబ కూడలిలో జరిగిన బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా అభినందించారు. పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ పై చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, ప్రధాన కార్యదర్శులు తమ్మిరెడ్డి శివశంకర్, బొలిశెట్టి సత్య, పార్టీ నేతలు సుందరపు విజయ్ కుమార్, పరుచూరి భాస్కర రావు,పంచకర్ల రమేష్ బాబు, పి.వి.ఎస్.ఎన్.రాజు, పంచకర్ల సందీప్, పి.ఉషా కిరణ్, వి. గంగులయ్య పాల్గొన్నారు.

వారాహి విజయ యాత్ర షెడ్యూల్ …

12వ తేదీ(శనివారం): ఉదయం 11 గంటలకు పెందుర్తి నియోజకవర్గానికి వెళ్తారు. వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సి.ఎన్.బి.సి. ల్యాండ్స్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. 13వ తేదీ(ఆదివారం) వారాహి విజయ యాత్రలో భాగంగా గాజువాక నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 14వ తేదీ(సోమవారం) ఉదయం 11 గంటలకు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని విస్సన్నపేటకు వెళ్తారు. అక్కడఆక్రమణకు గురైన భూములను సందర్శిస్తారు. 15వ తేదీ (మంగళవారం) మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 16వ తేదీ(బుధవారం) విశాఖ నగరం భీమిలి నియోజకవర్గంలో ధ్వంసానికి గురవుతున్న ఎర్రమట్టి దిబ్బలను సందర్శిస్తారు. 17వ తేదీ (గురువారం): విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు. 18వ తేదీ (శుక్రవారం) జరిగే కార్యక్రమాల వివరాలను తర్వాత ప్రకటిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement