జగనన్న తీసుకున్న స్వచ్ఛ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు చేపట్టారు. హిందూ, క్రీస్తవ మతాచారాలకు అనుగుణంగా ఛాంబర్లోకి అడుగు పెట్టారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు స్వీకరించారు. రూ.1445 కోట్లతో 74 ఘన వ్యర్థాలను శుద్ధిచేసే సేవరేజ్ ప్లాంట్స్ ఏర్పాటుకు పరిపాలనా ఆమోదం ఇస్తూ మొదటి సంతకం చేశారు. అనంతరం చవటపాముల నాగరాజు అనే వ్యక్తికి పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంటులో కారుణ్య నియామానికి ఆమోదిస్తూ రెండవ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మంత్రిగా మరోసారి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేనన్నారు. చిత్తశుద్ధితో తనకు అప్పగించిన పని చేస్తానన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ముఖ్యమంత్రి ఆశయమని.. దానికి అనుగుణంగా అన్ని నగరాలను అభివృద్ధి చేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు లాగా పని చేస్తామన్నారు. ఏపీని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement