Saturday, November 23, 2024

AP | ఏడాదిన్న‌రలో నగర ప్ర‌ధాన స‌మ‌స్య‌లను పరిష్కరిస్తా : ఎంపి కేశినేని

(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి రాగానే అభివృద్ధిపై దృష్టి సారించారని, విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో రోడ్లు రిపేర్లు, అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీల స‌మ‌స్యలు ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తున్నామని, ఈ విష‌యంపై త‌రుచూ విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర‌తో స‌మావేశం అవుతున్నామని, రాబోయే ఏడాదిన్న‌ర కాలంలో విజ‌య‌వాడ లోని ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే విధంగా ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ తో క‌లిసి ఒక ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతున్న‌ట్లు విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు.

తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ లోని భార‌తీ న‌గ‌ర్ లో ప‌లు రోడ్ల‌ నిర్మాణానికి, పార్క్ అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న కార్య‌క్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపి కేశినేని శివనథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ శిలపలకాన్ని ఆవిష్కరించటంతోపాటు , ప‌లు సిసి రోడ్ల నిర్మాణ ప‌నుల‌కి శంకుస్థాపన చేశారు.

ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్, 4వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ జాస్తి సాంబ‌శివ‌రావు ఆధ్వ‌ర్యంలో ప‌లు రోడ్లు అభివృద్దికి శ్రీకారం చుట్టిన‌ట్లు తెలిపారు. భార‌తీ న‌గ‌ర్ లోని రోడ్ నెంబ‌ర్ 10, 10 ఎ, రోడ్ నెంబ‌ర్ 11, 11ఎ, రోడ్ నెంబ‌ర్ 5ఎ, సిసి రోడ్ల నిర్మాణం, క‌డియాల శివ‌రామ‌కృష్ణ‌య్య పార్క్ లో వాకింగ్ ట్రాక్ తో పాటు ఇత‌ర స‌దుపాయాల ఏర్పాటు కోసం దాదాపు 83 ల‌క్ష‌ల రూపాయ‌ల నిధుల‌తో చేప‌ట్ట‌బోయే నిర్మాణ ప‌నుల‌కి శంకుస్థాప‌న చేయ‌టం చాలా సంతోషంగా వుంద‌న్నారు.

రాబోయే కాలంలో గ్రామీణ రోడ్లు, నేష‌న‌ల్ హైవేలు, స్టేట్ హైవ్ లు అనుసంధానం చేయాల‌నే ఆలోచ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంతో పాటు ప్ర‌జ‌ల అభివృద్ది విష‌యంలో సీఎం చంద్ర‌బాబు ఎక్క‌డ రాజీ ప‌డ‌టం లేదన్నారు. రాబోయే కాలంలో విజ‌య‌వాడ అభివృద్ధికి చిరునామాగా మారుతుంద‌న్నారు. అనంతరం ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ మాట్లాడుతూ ఇటీవ‌ల న‌గ‌రానికి వ‌ర‌ద వ‌చ్చిన సంద్భరంలో ఈ ప్రాంతం నీట మునిగిందన్నారు.

అందుకే సైడ్ డ్రైన్స్, అండ‌ర్ గ్రౌండ్స్ డ్రైనేజీలు ప్ర‌క్షాళ‌న చేయాల‌నే కార్య‌క్ర‌మంతో ఈ అభివృద్ధి ప‌నుల‌కి శ్రీకారం చుట్టిన‌ట్లు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్దికి నిధుల కొర‌త లేకుండా చూస్తాన‌ని సీఎం చంద్ర‌బాబు హామీ ఇచ్చార‌ని తెలిపారు.

- Advertisement -

ఈ కార్య‌క్ర‌మంలో స‌ర్కిల్ -3 ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ సామ్రాజ్యం, స‌ర్కిల్ -3 డి.ఈ. రామారావు, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు , దేవినేని అపర్ణ , మమ్మునేని ప్రసాద్, ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘు రామ‌రాజు,టిడిపి నాయకులు గొల్లపూడి నాగేశ్వరావు , కొడూరు ఆంజ‌నేయ వాసు, కాలనీ ప్రెసిడెంట్ మైనేని సాయిబాబు , పెరవల్లి ప్రసాద్ , అన్నే సాంబయ్య , కొర్రపాటి సురేంద్ర , నువ్వుల వెంకటేశ్వరరావు , ఎంసీ దాసు, రాజామణి ల‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement