Saturday, November 23, 2024

Maheswaram – కరోనా , వరదల సమయంలో వివక్ష లీడర్లు యాడకి పోయారు… నిలదీసిన మంత్రి సబిత

మహేశ్వరం అర్బన్ నవంబర్ 15 ప్రభ న్యూస్మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్ బస్ స్టాప్ దగ్గర 8, 9, 10, 11 వ డివిజన్ లకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ సమావేశానికి ముఖ్య అతిధిగా మహేశ్వరం నియోజకవర్గ అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థి,మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.మీర్ పేట్ కాలనీలను బంజారాహిల్స్ కు దీటుగా తయారు చేయటానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.నాడు వర్షాలు వస్తే ఇపుడు పోటీలో ఉన్న నాయకులు ట్రాక్టర్ లో తిరిగితే,మొకల్లోతు నీళ్లలో నేను తిరిగానని,కరోనా లో కనిపించని నేతలు,కష్టాల్లో కనబడని నేతలు నేడు మీ ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.

ఒక పార్టీ తరపున పోటీ చేస్తున్న నాయకునికి తాండూరు లో సీటు అడిగితే, మహేశ్వరం లో ఇచ్చారని ఇష్టం లేకున్నా పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారని, రేపు ఎన్నికలు అయ్యాక వీళ్ళు కనిపిస్తారా అని ప్రశ్నించారు. చేవెళ్ల లో చెల్లని రూపాయి,మేడ్చల్ లో చెల్లని రూపాయి మన మహేశ్వరం లో చెల్లుతుందా అంటూ ప్రజలను అడుగగా చెల్లదు అని వారంతా బదులిచ్చారు v.కాలనీల సంక్షేమానికి కృషి చేసానని,అందరి ఆశీర్వాదాలు కావాలన్నారు. .ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే 400 కే గ్యాస్ అందిస్తారని అన్నారు.2 వేలు ఉన్న ఆసరా పెన్షన్లు 5 వేలు,4 వేలు ఉన్న వికలాంగుల పెన్షన్ 6 వేల వరకు పెంచబోతున్నట్లు తెలిపారు.మహిళలకు ప్రతి నెల సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా 3 వేలు అందిస్తామని,రైతు భీమా లాగా 93 లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు భీమా సౌకర్యం కలిస్తామన్నారు.

మహేశ్వరం నియోజకవర్గములోని బడంగ్ పేట్,మీర్ పేట్,తుక్కుగూడ,జల్ పల్లి జంట కార్పొరేషన్లు,జంట మునిసిపాలిటీలలో 832 కోట్ల రూపాయల భారీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.జంట కార్పొరేషన్ల పరిధిలో ట్రoక్ లైన్లు,నాళాల నిర్మాణాలతో వరదనీటి ముంపు సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. నాలాల అభివృద్ధికి 110 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయన్నారు..తాగునీటి సమస్య లేకుండా చేయటానికి 280 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నట్లు నూతన పైప్ లైన్లు,ట్యాంకులు, రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో బడంగ్ పేట్,మీర్ పేట్,జల్ పల్లి,తుక్కుగూడ ల పరిధిలోని 11 చెరువులలో 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సుందరికరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.13 బస్తీ దవాఖానలు,8 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement