మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం అధికారులు, అర్చకస్వాములు, వేదపండితులు, దుర్గామల్లేశ్వర దేవస్థానం సిబ్బందికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాల సమర్పణ సంకల్పం పట్టించారు. తర్వాత నూతన వస్త్రాలకు పూజాదికాలు జరిపించారు.
ఈ సందర్భంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ మాట్లాడుతూ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరుపున ఆనవాయితీగా పట్టువస్త్రాలను సమర్పించామన్నారు. జ్యోతిర్లింగస్వరూపుడైన శ్రీమల్లికార్జునస్వామివారికి, మహాశక్తిస్వరూపిణి అయిన భ్రమరాంబాదేవివారికి బ్రహ్మోత్సవాలలో పట్టువస్త్రాలను సమర్పించే అవకాశం రావడం తమ పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నాన్నారు.