Wednesday, November 20, 2024

శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివారాత్రి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వచ్చేనెల 4వ తేదీ వరకు 11రోజులపాటు జరిగే ఉత్సవాలకు వేదపండితులు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. సకల దేవతలను ఆహ్వానిస్తూ రాత్రి 7 గంటలకు ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజారోహణం, ధ్వజపటావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో బుధవారం నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు.

ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అధికారులు వసతి ఏర్పాటు పూర్తిచేశారు. భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో దర్శనం టిక్కెట్లును అధికారులు విడుదల చేశారు. అతి శీఘ్ర దర్శనం టికెట్లు రూ.500 , శీఘ్ర దర్శనం రూ.200 , ఉచిత దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచారు.

వాహన సేవల వివ‌రాలు..
ఫిబ్రవరి 23- భృంగి వాహన సేవ
ఫిబ్రవరి 24- హంస వాహన సేవ
ఫిబ్రవరి 25- మయూర వాహన సేవ
ఫిబ్రవరి 26- రావణ వాహన సేవ
ఫిబ్రవరి 27- పుష్పపల్లకీ వాహన సేవ
ఫిబ్రవరి 28- గజ వాహన సేవ
మార్చి 1- ప్రభోత్సవం, నందివాహన సేవ, లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం
మార్చి 2- రథోత్సవం, తెప్పోత్సవం
మార్చి 3- పూర్ణాహుతి
మార్చి 4- అశ్వవాహన సేవ

Advertisement

తాజా వార్తలు

Advertisement