నేడు కనకదుర్గమ్మ అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ మహాసరస్వతిగా దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వడంతో ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని క్యూలైన్లను ఉచితంగా ప్రకటించారు. వీఐపీలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించలేమన్న అధికారులు స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రికి సుమారు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఐదువేల మంది పోలీసులతో బందోబస్తును నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శివస్వామి దుర్గమ్మను దర్శించుకుని భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు సంక్లిష్టంగా ఉన్నా సామాన్యులకు త్వరగా దర్శనం కలుగుతుందని అన్నారు.ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement