Friday, November 22, 2024

Mahanadu – రేపు టిడిపి తొలి మేనిఫెస్టో విడుద‌ల – చంద్ర‌బాబు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం – వచ్చే ఎన్నికలకు సంబంధించిన తొలి మేనిఫెస్టో రేపు మహానాడులోనే విడుదల చేస్తామని చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. పేదలకు అదిరిపోయే సంక్షేమం అందిస్తామని ప్రకటించారు. వైసీపీ సంక్షేమం ఓట్లు కురిపిస్తుందనే నమ్మకంతో ఉన్న వేళ చంద్రబాబు కౌంటర్ ప్రకటన చేసారు. అభివృద్ధి తో పాటుగా అదిరిపోయే సంక్షేమం అందిస్తామని ప్రకటించారు. తెలంగాణలో నాడు తాము వేసిన పునాది కారణంగా ఆ రాష్ట్రం ప్రస్తుతం అగ్ర స్థానంలో ఉందన్నారు. తనకు..కేడర్ కు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేదని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు నవ్ ఆర్ నెవర్ అంటూ ప్రాధాన్యతను వివరించారు. తాను గెలిచే అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పిన అంశాన్ని గుర్తు చేసారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు టీడీదీనని ధీమా వ్యక్తం చేసారు. రాజమండ్రిలో టీడీపీ మహానాడు పార్టీ అధినేత చంద్రబాబు జెండా ఆవిష్కర‌ణ‌తో నేడు ప్రారంభ‌మైంది. ముందుగా ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. అనంత‌రంత ప్రారంభోపన్యాసం చేస్తూ, ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కార్యకర్తలు పార్టీ కోసం చేసిన త్యాగాలకు సెల్యూట్ చేసారు. భవిష్యత్ లో పార్టీ కార్యకర్తలను అన్ని రకాలుగా ఆదుకొనే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజావేదిక విధ్వసంతో ప్రారంభమైన పాలన అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిందని ఆరోపించారు. ఎక్కవ మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి.. సాష్ఠాంగ ప్రమాణాలు చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

నాడు ఎన్నికల సమయంలో ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఇప్పుడు విశ్వరూపం చూపిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే ధనిక సీఎం జగన్ అయితే..పేదలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ అని చెప్పుకొచ్చారు. ఇలాంటి వాళ్లను చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. ఏపీలో రెండు వేల నోట్లు లేవన్నారు. అవన్నీ వైసీపీ నేతలు మార్చి దగ్గర పెట్టుకున్నారని విమర్శించారు. పీ 4 విధానం ద్వారా పేదలను ధనికులను చేసే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. యువగళం బాగా జరుగుతోందని చంద్రబాబు ప్రశంసించారు. తాను నాడు అసెంబ్లీలో చేసిన శపధాన్ని చంద్రబాబు గుర్తు చేసారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని సక్సెస్ చేసారని పార్టీ శ్రేణులను అభినందించారు.
పార్టీని క్లస్టర్, యూనిట్, బూత్, కుటుంబ సాధికారిక సారధులతో బలోపేతం చేసామని వివరించారు. ప్రతీ కార్యకర్త ప్రజలు..పేదలతో మమేకం అవ్వాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికలే టార్గెట్ గా పని చేయాలని నిర్దేశించారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావంటే టీడీపీ అధికారంలోకి రావటం అవసరమని చంద్రబాబు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement