అమరావతి, ప్రభన్యూస్ : మహానాడులో వంటకాల ఘుమఘుమలు అదరగొడుతున్నాయి. ఒంగోలులో జరుగుతున్న మహానాడు తొలి రోజు వంటకాలు అతిధులను ఆకట్టుకున్నాయి. రెండు రోజుల పాటు కొనసాగే ఈ పసుపు పండుగలో వచ్చే అతిథుల కోసం టీడీపీ భారీ ఫుడ్ మెనూ సిద్ధం చేసింది. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పర్యవేక్షణలో ఆహార కమిటీ రుచికరమైన వంటకాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే వెయ్యి మంది నిష్ణాతులైన వంటగాళ్ళు మహానాడు ప్రాంగణంలో వంటకాలను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 11 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి ఆతిధ్యంను అందిస్తున్నారు. ఒక్కో ఫుడ్ కోర్టుకు ఒక్కో ఆహార కమిటీ సభ్యుడిని ఇంఛార్జిగా నియమించి ఎలాంటి లోటు పాట్లు లేకుండా పర్యవేక్షణ చేస్తున్నారు.
లంచ్ డిన్నర్ మెనూ… సేమ్యా కేసరి, అరటికాయ బజ్జీ, టమోటా పప్పు, బంగాళదుంప ఫ్రై, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ, దొండకాయ చట్నీ, పప్పుచారు, అప్పడాలు, వడియాలు, వైట్ రైస్, నెయ్యి, పెరుగు వడ్డించారు. బ్రేక్ ఫాస్ట్‌గా నేరేడు హల్వా (స్వీట్), ఇడ్లీ, గారె, పొంగల్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కారప్పొడి, నెయ్యి, సాంబారు, టీ, కాఫీ, 28వ తేదీ లంచ్:చక్కెర పొంగలి, తాపేశ్వరం కాజా, మసాల వడ లేదా మిర్చి భజ్జీ లేదా పుదీనా ఫింగర్, వెజిటబుల్ బిర్యానీ, వెజ్ జైపూర్ కుర్మా, రైతా, దోసకాయ పప్పు, దొండకాయ పకోడి ఫ్రై లేదా బెండకాయ కొబ్బరి ఫ్రై, అరటికాయ గ్రేవీ కర్రీ, గోంగూర ఉల్లిపాయ చట్నీ, డైమండ్ చిప్స్, అప్పడాలు, సాంబారు, పచ్చిపులుసు, వైట్ రైస్, నెయ్యి, పెరుగు, ఐస్ క్రీమ్ అందించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..