తిరుపతి సిటీ, మే 14, ప్రభ న్యూస్ : స్థానిక కపిలతీర్థంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించింది టిటిడి. ఈ కార్యక్రమంలో టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. అత్యంత వేడుకగా జరిగిన ఈ వేడుకల్లో కుంభ ఆవాహనం అగ్ని ప్రణయణం వేదోక్తంగా నిర్వహించారు. తిరుపతి లోని కపిలతీర్థంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. అనంతరం సామాన్య భక్తులను అనుమతించేందుకు టిటిడి సిద్దమైంది. ఈ నేపద్యంలో ఆదివారం ఉదయం ఆలయంలో పున్యాహవచణం, విష్వక్సేన ఆరాధన, కుంభ ఆరాధన, విశేష హోమం నిర్వహించి మహా పూర్ణాహుతి చేపట్టారు.. కుంభ ప్రదక్షణం, నైవేద్యం ప్రధాన కలశంను గర్భాలయంలోకి తీసుకువెళ్ళి స్వామి అమ్మవారి సంప్రోక్షణ చేశారు. 9 నుంచి 10 గంటల మధ్య మిథున లగ్నంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి మహాసంప్రోక్షణ నిర్వహించారు.
ఈ సందర్భంగా టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ… అతి పురాతనమైన శ్రీ లక్ష్మి నరసింహ ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం వైభవోతంగా నేటితో ముగిసిందని, ఆ తర్వాత భక్తులకు సర్వదర్శనం కల్పించడం జరుగుతుందన్నారు.. నగర వాసులు, శ్రీవారి భక్తులు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి వారి ఆశీస్సులు అందుకోవాలని అయన విజ్ఞప్తి చేశారు. అనంతరం వేద పారాయణం చేసిన పురోహితులకు టిటిడి తరపున టిటిడి పాలక మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్ సంభావన అందచేశారు. ఈకార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కంకణభట్టార్, సూర్యకుమార్ ఆచార్యులు, డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్, భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.