ఎన్నికల కమిషన్ ముద్రించిన ఓటరు కార్డులో ఎలాంటి సిత్రాలు చోటుచేసుకున్నాయో పరిశీలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వెంకట శివప్రకాష్‌కుమార్ నందిగం.. పుట్టిన తేదీ 06.12.1979 కాగా.. ఎన్నికల కమిషన్ తాజాగా ముద్రించిన పంపిన కార్డులో 01.01.1900గా నమోదు చేయడం గమనార్హం.
దీని ప్రకారం ఓటరు వయసు 124 ఏళ్లు కావడంతో అతడు కంగుతిన్నారు. ఈ తప్పును సవరించాలని సంబంధిత అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని శివప్రకాష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ 34లోని 969 వరుస సంఖ్యతో తన పేరు జాబితాలో ఉందని, కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉండడం వల్ల ఇబ్బందులు ఉంటాయని అతడు పేర్కొన్నారు.