ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా మధుమూర్తి నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రస్తుతం వరంగల్ నీట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా ప్రొఫెసర్ మధుమూర్తి ఉన్నారు.
గుంటూరు జిల్లా తెనాలి మండలం జాగర్లమూడికి చెందిన మధుమూర్తి విశాఖపట్నంలో విద్యనభ్యసించారు. ప్రస్తుతం హనుమకొండలో ఉంటున్నారు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే అప్పటి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంది. వైస్ ఛైర్మన్ రామమోహన్‌రావు ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు.
- Advertisement -