అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జూలై 21న అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనలో కీలక పైళ్లు దహనం కాగా… ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు కేసు నమోదైంది. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ను… పలమనేరులో ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అన్నతరంను చిత్తూరు కోర్టులో హాజరుపరచగా…. ట్రయల్ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.