మచిలీపట్నంకు పోర్టు రాకుండా చంద్రబాబే అడ్డుపడి.. తీవ్ర ద్రోహం చేశాడని సీఎం జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. బందర్ పోర్ట్ ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. బందరుకు శతాబ్దాల చరిత్ర ఉంది.. అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు. 5156 కోట్లతో, నాలుగు బెర్తులతో ఈ పోర్టు ప్రారంభం అవుతుందని వెల్లడించారు.ట్రాఫిక్ పెరిగేకొద్దీ బెర్తులను పెంచి 116 మిలియన్ టన్నుల వరకు సామర్థ్యం పెంచే అవకాశం ఉందని వివరించారు. చంద్రబాబు మచిలీపట్నానికి తీవ్ర ద్రోహం చేశాడు.. పోర్టు గ్రహణాలన్నీ తొలగిపోయాయని చెప్పుకొచ్చారు. ఇక అడుగులు వేగంగా పడతాయి… మచిలీపట్నం రూపు రేఖలు మారుతున్నాయని చెప్పారు.
గతంలో బందరు జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కలెక్టర్ తో సహా ఒక్క అధికారి కూడా ఇక్కడ ఉండేవారు కాదు… వారంలో ఒకరోజు వస్తే అదే పదివేలు అన్నట్లు పరిస్థితి ఉండేదని వివరించారు. ఇప్పుడు కలెక్టర్ తో సహా మొత్తం యంత్రాంగం ఇక్కడే ఉంటున్నారు.. బందరు విద్యార్థులు ఇక్కడే మెడికల్ విద్య పొందే అవకాశం కల్పించామన్నారు. అలాగే ఈనెల 26న అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. అమరావతిలో 50వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అమరావతిలో పేదలు ఉండకూడదన్నారు.