Tuesday, November 26, 2024

KNL: తొలకరిలో రైతుకు అదృష్టం.. పొలంలో రూ.2కోట్ల విలువైన వజ్రం లభ్యం..

ఎక్కడైనా తొలకరి వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయంటే అన్నదాతలు వ్యవసాయ పనులు మొదలుపెడతారు. సాగుకు ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం అలా కాదు.. తొలకరి వర్షాలు ప్రారంభమయ్యాయంటే చిన్నాపెద్దా తేడా లేకుండా జనం పొలాల బాట పడతారు. అయితే, వ్యవసాయ పనుల కోసం మాత్రం కాదు.. వజ్రాల వేట కోసం. అవును, వజ్రాల వేటే. రాయలసీమలోని పలు జిల్లాల్లో ఏటా ఈ సీజన్ లో ఇది సాధారణమే.

అయితే తాజాగా కర్నూలు జిల్లాలో ఓ రైతు పంట పండింది. పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. తుగ్గలి మండలం బసనేపల్లిలో పొలం పనులు చేస్తుండగా ఓ రైతుకు వజ్రం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారులు వజ్రం కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. అయితే చివరకు గుత్తికి చెందిన వ్యాపారి ఒకరు రూ.2 కోట్లకు ఆ వజ్రాన్ని కొనుగోలు చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ సీజన్‌లో లభించిన అత్యంత విలువైన వజ్రంగా దీనిని చెబుతున్నారు. సాధారణంగా లక్షల రూపాయలు విలువ చేసే వజ్రాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయని.. కానీ రూ.2 కోట్ల విలువైన వజ్రం లభించడం అరుదు అని స్థానికులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో రైతులు, స్థానికులు పొలాల్లో వజ్రాల వేటను మరింత ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement