Saturday, November 23, 2024

వాయుగుండం బలపడిన అల్పపీడనం.. ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, నెల్లూరుకు వర్షసూచన

అమరావతి, ఆంధ్రప్రభ: ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం తూర్పు భూమధ్యరేఖ ప్రాంతము వద్ద గల అల్పపీడనం సోమవారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతం లో ప్రవేశించి వాయుగుండంగా బలపడింది. మధ్యాహ్న సమయానికి ట్రింకోమలైకు 610 కిలోమీటర్లు, తమిళనాడులోని కరైకల్‌కు 820 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం మంగళవారం సాయంత్రం వరకు పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆ తరువాత దక్షిణ నైరుతిగా దిశ మార్చుకుని ఫిబ్రవరి ఒకటో తేదీ బుధవారం ఉదయం శ్రీలంక లో తీరం దాటనున్నదని వాతావరణ శాఖ తెలిపింది.

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా సోమవారం వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement