Thursday, November 21, 2024

AP Politics: రెండు వైపులా సమ్మతి ఉంటేనే లవ్‌ సక్సెస్‌.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

కుప్పం, ప్రభన్యూస్‌: గతంలో టీడీపీకి మిత్ర పక్ష మెన జనసేనతో పొత్తుకు సిద్ధంగా ఉన్నామ న్న మాట టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నోట వినిపించింది. కలిసొస్తే వచ్చే ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌తో కలిసి పోటీ చేయాలన్న తన మనస్సులోని మాటను బాబు చెప్పకనే చెప్పారు. కుప్పం నియో జకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సంద ర్భంగా ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు రాజ కీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీశాయి. నియోజక వర్గ పర్యటనలో భాగంగా బాబు నిర్వహించిన రోడ్‌షో లో అభిమానులు పవన్‌కళ్యాణ్‌ ప్రస్థావన తీసుకొ చ్చారు. జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్దాం అన్న అభి ప్రాయాన్ని టీడీపీ కార్యకర్తలు బహిరంగంగానే చంద్రబాబుకు చెప్పారు. అందుకు స్పందనగా అదే వేదిక నుంచి ఆయన పొత్తులపై తన మనస్సులోని మాటను బయటపెట్టారు. లవ్‌ అనేది రెండు వైపుల నుంచి ఉండాలి, ఇరువైపులా సమ్మతిస్తేనే పొత్తు అనే ప్రేమ చిగురిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశా రు.

లవ్‌ ఎప్పుడూ వన్‌సైడ్‌ ఉండకూడదని, రెండు వైపులా ఉంటేనే లవ్‌ సక్సెస్‌ అవుతుందని కార్య కర్త లతో ఆయన తన మనస్సులోని మాటను స్పష్టం చెప్పారు. దీంతో రోడ్‌షోలో కొంతసేపు నవ్వులు విర బూశాయి. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పోటీ చేయాలన్న అభిప్రాయాన్ని ఇప్పటికే టీడీపీలో మెజార్టీ వర్గం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లింది. అదేవిధంగా చంద్రబాబు ఆయా జిల్లాల పర్యటనకు వెళ్లిన సందర్భంలోనూ కార్యకర్తలు పవన్‌కళ్యాణ్‌ ప్రస్థావన తీసుకొస్తున్నారు. 2014 ఎన్నికల్లో జన సేనతో కలిసి పోటీ చేయడం టీడీపీకి మరింత కలి సొచ్చిందని, ఫలితంగానే నవ్యాంధ్రకు తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని పదేపదే ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు కూడా అధినేతకు గుర్తు చేస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో టీడీపీ, జన సేనలు కలిసి పోటీచేస్తే ఫలితాలు తమకు అను కూలంగా ఉంటాయన్న భావన తెలుగుదేశం నేతల్లో వ్యక్తమవుతున్నది. ఆ దిశగానే కొంత మంది సీనియర్‌ నేతలు జనసేనతో పొత్తుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ దిశగానే చంద్రబాబును ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా గురువారం చంద్ర బాబు సొంత నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో బాబు కూ డా వారి అభిప్రాయాన్ని చిరునవ్వుతోనే స్వాగతిం చారు. ఎక్కడా కూడా వ్యతిరేక భావన వ్యక్తం చేయ కపోవడాన్ని బట్టి చూస్తుంటే పవన్‌తో కలిసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement