Saturday, November 23, 2024

Lotus Poli’tricks’ వైసిపికి దూరంగా… టిడిపికి ద‌గ్గ‌రగా – క‌మ‌ల‌నాధుల వ్యూహం..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ రగల్చిన వేడి రగులుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఈనెల 10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 11న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన విమర్శలు, ఆ తరువాత సీఎం జగన్‌ ఈనెల 12న వాటిని బహిరంగంగా ఖండించిన నేపథ్యంలో మంత్రులు కూడా బీజేపీ తీరుపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌, మంత్రుల కామెంట్లపై బీజేపీ నేతలు వరుస మీడియా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నా రు. అయితే, ఈ అనూహ్య పరిణామాలకుగల కారణాలపై రాజకీయ విశ్లేషణలు పెద్దఎత్తున జరుగు తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అసలు ఎందుకలా వ్యవహరించిందన్న దానిపై పెద్దఎత్తున చర్చ జరుగు తోంది. ఒక వైపు నిధులు వరద పారిస్తూనే మరోవైపు అవినీతి అంటూ చేసిన విమర్శలపై చర్చ ప్రారంభ మైంది. దీనిపై అధికార పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే ఒక అవగాహనకు వస్తున్నారు. ముచ్చటగా మూడో సారి కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడ మే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోందని, ఆ క్రమం లోనే సీఎం జగన్‌ను బీజేపీతో కలిసి రావాలని కోరిన మీదట ఆయన ససేమిరా అనడంతో పాత మిత్రులపై దృష్టి సారించారని వైపీసీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే గతంలో ఎన్డీయే భాగస్వాము లుగా ఉన్న పార్టీలందరికీ ఆహ్వానాలు పంపారని, ఆ క్రమంలోనే చంద్రబాబుకు కూడా ఆహ్వానం అంది నట్లు వారు చెబుతున్నారు. అయితే, అది కేవలం తెలంగాణ వరకే అనుకున్నప్పటికీ, ఇరు రాష్ట్రాల్లో అయితేనే జతకడదామని అని తెదేపా అధినేత చంద్రబాబు మెలికపెట్టడం వల్లే బీజేపీ నిర్ణయం తీసుకుని ఉండవచ్చన్నది వైసీపీ నేతలు భావిస్తు న్నారు. అయితే, ఇది తమకు కలిసొచ్చే అంశంగానే వారు చెప్పుకోవడం విశేషం.


పాత మిత్రులతో మళ్లి దోస్తానా?
దక్షిణాది రాష్ట్రాల్లో అన్నా డీఎంకే మాత్రమే ప్రస్తుతం బీజేపీకి మద్దతుగా ఉంది. ఆ పార్టీ తమిళనా డులో నాయకత్వ సమస్యతో కొట్టు-మిట్టాడుతోంది. త్వరలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగను న్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల ముందు జరిగే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ఇదే సమయంలో ముందస్తుగానే మద్దతుదారులను కూడ గట్టాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. మాజీ మిత్రులను కలుపుకొనేందుకు పావులు కదిపింది. జేడీఎస్‌ ముందుకు వచ్చింది. శివసేన చీలి కవర్గం బీజేపీతోనే ఉంది. శిరోమణి అకాలీదళ్‌తోనూ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. అక్కడ పొత్తులు అవసరమని గుర్తించింది. ఇందుకు టీ-డీపీ అధినేతతో చర్చలు చేసింది. తెలం గాణ వరకు తొలుత టీ-డీపీతో పొత్తుకు ప్రతిపాదించింది. పొత్తు అనేది ఉంటే రెండు రాష్ట్రాల్లోనూ ఉండాలని చంద్రబాబు తేల్చి చెప్పారని ప్రచారం జరుగుతోంది. ఏపీలో వైసీపీ పలు సందర్బా éల్లో కేంద్రానికి మద్దతుగా నిలిచింది. వైసీపీని ఎన్డీఏ లోకి రావాలని బీజేపీ నాయకత్వం ఆహ్వానించింది. అందుకు సీఎం జగన్‌ సున్నితంగా తిరస్కరించి అవసరమైన సమ యంలో మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు- ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణకే టీ-డీపీతో పొత్తుకు పరిమితం కావాలని భావించిన బీజేపీ, ఇప్పుడు ఏపీకి పొత్తు విస్తరించక తప్పని పరిస్థితి. కానీ, ఈ పొత్తు టీ-డీపీ ద్వారా బీజేపీకి ప్రయోజనం కలిగిస్తుంది. కానీ, టీ-డీపీకి మాత్రం కాదనే అభిప్రా యం ఉంది. బీజేపీ నెరవేర్చని హామీల సమయంలో ఇప్పుడు టీ-డీపీ పొత్తు పెట్టు-కుంటే లాభమా? నష్టమా అనే చర్చ మొదలైంది. బీజేపీ అవసరానికి అనుగుణంగా రాజకీయాలు చేస్తున్న దంటూ ప్రజల్లో జరుగుతున్న వ్యతిరేక చర్చ టీ-డీపీపైన ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement