Wednesday, October 23, 2024

AP | విద్యాశాఖ అధికారులతో లోకేశ్ సమీక్ష

రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు సహకారంతో అమలవుతున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రాజెక్టు అమలు తీరుపై పాఠశాల విద్యాధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ప్రయివేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాలు రూపొందించాలని తెలిపారు. సాల్ట్ ప్రాజెక్టుపై శుక్రవారం పాఠశాల విద్యాధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు.

నాడు-నేడు, సాల్ట్ వంటి పథకాలపై గత ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసినట్లు కేవలం కాగితాల్లో మాత్రమే చూపుతోందని… అదే నిజమైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారి సంఖ్య ప్రస్తుతం 2 లక్షలకు ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. దీనిపై లోతైన విశ్లేషణ చేసి, నాణ్యమైన విద్య అందించి.. మైరుగైన ఫలితాలు పొందడం కోసం చిత్తశుద్ధితో పని చేయాలని అధికారులకు సూచించారు.

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్ నెట్ తప్పని సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని లోకేశ్ ఆదేశించారు. అంతే కాకుండా ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఎసె‌స్మెంట్ మరింత శాస్త్రీయంగా ఉండే విధంగా డిజైన్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. డిటిటలైడ్జ్ ఎసె‌స్మెంట్ మరింత సమర్థవంతంగా నిర్వహించి, ఆన్ లైన్‌లో అనుసంధానంపై దృష్టి సారించాలని ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ సంస్థను మంత్రి ఆదేశించారు. అంతే కాకుండా ఆయా ఎజెన్సీలు నిర్వహిస్తున్న ఎసె‌స్‌మెంట్, శిక్షణా కార్యక్రమాలు అర్థవంతగా, ఫలితాల మెరుగుదలకు దోహదపడేలా ఉండాలని అన్నారు. ఇంటర్ మీడియట్‌లో మార్కులకు బదులుగా గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement