దావోస్ లో పర్యటిస్తున్న రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కాగ్నిజెంట్ నుంచి త్వరలో శుభవార్త రానుందని తెలిపారు. బెల్వదర్‌లో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఈవో ఎస్.రవికుమార్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌ను ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయో టెక్నాలజీ, రెన్యువబుల్ ఎనర్జీలో డీప్ టెక్ హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించాం అని అన్నారు.
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో 2.2 మిలియన్ చదరపు అడుగుల కో-వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందని… కాగ్నిజెంట్ గ్రోత్ స్ట్రాటజీ, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికలలో భాగంగా, విశాఖపట్నం వంటి టైర్-2 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు.
ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటిలో హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ను తయారు చేయడానికి ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు. కాగ్నిజెంట్ సిఇఓ రవికుమార్ మాట్లాడుతూ… ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
గన్నా హెన్ కెన్ కంపెనీ తో భేటీ !
వినూత్న మార్కెటింగ్, బ్రూవరీస్, స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్‌కు ప్రసిద్ధి చెందిన గన్నా హెన్ కెన్ కంపెనీ సీఈఓ డాల్ఫో వాన్ డెన్ బ్రింక్‌తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో బీర్ల తయారీ, ఎఫ్‌ఎంసీజీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డెన్ బ్రింక్ తెలిపారు.
లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టుబడులకు స్వాగతం
సప్లయ్ చైన్, లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రా రంగాల్లో పేరెన్నికగన్న బహుళజాతి కంపెనీ ఎజిలిటీ వైస్ చైర్మన్ తారిఖ్ సుల్తాన్‌తో నారా లోకేష్ భేటీ అయ్యారు.
కార్గో రవాణాకు అన్ని సౌకర్యాలున్న ఏపీలో లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులు పెట్టాలని.. ఓడరేవుల పరిసరాల్లో ఎజిలిటీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, వేర్ హౌస్‌లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖపట్నం లేదా తిరుపతిలో గ్లోబల్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని తారీఖ్ సుల్తాన్ ను మంత్రి కోరారు.