ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్హత, వసతి బకాయిల కారణంగా సర్టిఫికెట్లు అందని విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించిన నారా లోకేష్… వైసీపీ ప్రభుత్వం పెట్టిన రూ.3480 కోట్ల బకాయిల వల్ల లక్షలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయని తెలిపారు. విద్యాసంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీకి చర్యలు…. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపుదల, పాఠ్యాంశాల్లో మార్పులు, విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు పాఠ్యాంశాల్లో మార్పులు, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు, మౌలిక వసతుల కల్పన. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలు తదితర నిధుల వినియోగంపై సమీక్షించారు.