Tuesday, November 19, 2024

RRR కుటుంబసభ్యుల ఫిర్యాదుపై స్పందించిన లోక్‌ సభ స్పీకర్‌

నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కుటుంబసభ్యుల ఫిర్యాదుపై లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు. రఘురామ కుటుంబీకుల ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి స్పీకర్‌ పంపారు. రఘురామ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాలని హోంశాఖను కోరారు. ఫిర్యాదు కాపీని హోంశాఖకు లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయం పంపింది.

కాగా, రఘురామ అరెస్ట్ వ్యవహారంపై ఆయన కుటుంబ సభ్యులు లోక్ సభ స్పీకర్, కేంద్ర రక్షణ మంత్రికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రఘురామ సతీమణి రమాదేవి, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని, తనయుడు భరత్‌ తో కలిసి గురువారం(మే20) ఓం బిర్లా, రాజ్‌ నాథ్‌ లతో సమావేశమయ్యారు. రఘురామపై జగన్‌ ప్రభుత్వం సీఐడీ ద్వారా అక్రమంగా పెట్టిన కేసులు, అరెస్టు తీరు, భౌతిక దాడులు, కోర్టు ఆదేశాల ధిక్కరణలను కూలంకషంగా వివరించారు.  అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్‌ వేశారన్న కక్షతోనే రాజద్రోహం కేసు పెట్టారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు ప్రాణభయం ఉందని.. జోక్యం చేసుకుని న్యాయం చేయాలని లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ లకు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: పదో తరగతి ఫలితాల విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement