రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. లోక్‌సభలో ఇదే తన చివరి ప్రసంగమని తెలిపారు.తనకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సభలో ఎందరో తనకు మార్గదర్శకంగా ఉన్నారని అన్నారు. తనను పార్లమెంట్‌కు పంపిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు గల్లా జయదేవ్.
ప్రజాస్వామ్య ప్రక్రియలో వ్యాపారులది కూడా కీలక పాత్ర అని… ఎంతో మంది వ్యాపారవేత్తలు చట్ట సభలకు ఎన్నికవుతున్నారని జయదేవ్ తెలిపారు. వ్యాపారవేత్తలపై రాజకీయ కక్షలు సరికాదని… వారిపై రాజకీయ వేధింపులను నివారించాలని కోరారు. దేశం, రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్రను పోషిస్తూనే ఉంటానని చెప్పారు. రాముడు 14 ఏళ్లు వనవాసం చేసినట్టు తాను కూడా రాజకీయాల్లో విరామం తీసుకుంటున్నానని… కొన్నాళ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు..