కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శ్రీ సాయిరాం డిస్టన్స్ డిగ్రీ పరీక్షలు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. కాలేజ్ పరీక్ష కేంద్రం శ్రీ సాయిరాం కళాశాలనే. డిస్టన్స్ పరీక్షల్లో దాదాపు 300 మంది పరీక్షలు రాస్తున్నారు. బుధవారం మూడవ రోజు మధ్యాహ్నం కళాశాలకు గేటు మూసి తాళం వేసి పరీక్షలు రాస్తున్నారు. గేటుకు తాళం వేసి పరీక్షలు రాస్తుండటంలో ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఈ కళాశాలలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు డిస్టన్స్ లో డిగ్రీ సర్టిఫికెట్ కోసం, ఉద్యోగాలు ప్రమోషన్ కోసం డిస్టన్స్ డిగ్రీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుండి పాస్ సర్టిఫికెట్ కోసం రూ.50 వేల వరకు వసూళ్ళు చేసినట్లు ఆరోపిస్తున్నారు. కళాశాల పరీక్షల్లో జరుగుతున్న మాస్ కాపీయింగ్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.